Mental Gym అంటే
చదువు ఒక్కటే సరిపోదు. మనసుకీ training కావాలి.
పరీక్షలు, ఉద్యోగం, డబ్బు, మనుషులు, ఒత్తిడి: జీవితం వేసే ఈ ప్రశ్నలకి ఏ syllabus లోనూ జవాబులు లేవు. వాటిని ఎదుర్కొనే నైపుణ్యాలు మన మెదడులోనే తయారవుతాయి. Mental Gym ఆ మెదడుని అర్థం చేసుకుని, రోజూ కొంచెం train చేసే చోటు.
కల
నీలం
ఎందుకు
డిగ్రీ నేర్పని పాఠాలు
చదువు మనల్ని ఉద్యోగం దాకా తీసుకెళ్తుంది. కానీ రోజూ ఎదురయ్యే ఒత్తిడి, నిర్ణయాలు, మనుషులు, అలవాట్లు: వీటిని దాటాలంటే life skills కావాలి.
- చదివింది exam లో గుర్తుకు రాదు
ఒత్తిడిలో memory ఎలా జారిపోతుందో తెలిస్తే, చదివే పద్ధతే మారుతుంది.
- Phone పక్కన ఉంటే ఒక్క పనీ పూర్తవదు
Focus అంటే willpower పరీక్ష కాదు. దాన్ని కాపాడే అలవాట్లు నేర్చుకోవచ్చు.
- ఒక offer చూసి అవసరం లేనిది కొంటాం
డబ్బు దగ్గర మెదడు పడే traps తెలిస్తే, ఆగి ఆలోచించడం అలవాటవుతుంది.
- ఒక్క మాటకి రోజంతా మనసు పాడవుతుంది
మనుషుల మాటలు మన మీద ఎందుకంత బరువుగా పడతాయో అర్థమైతే, తేలిగ్గా తీసుకోగలుగుతాం.
ఇవేవీ తెలివి తక్కువైనందుకు కాదు. ప్రతి మనిషి మెదడూ సహజంగా ఇలాగే పనిచేస్తుంది. ఆ తీరు అర్థమైతే, దాన్ని train చేయొచ్చు.
Brain workout
మెదడుకీ workout ఎందుకు?
- మెదడు మారుతూనే ఉంటుంది
మీరు మళ్ళీ మళ్ళీ చేసేదాన్ని మెదడు బలపరుస్తుంది. Gym లో కండరం పెరిగినట్టే, సాధనతో ఆలోచించే తీరూ మారుతుంది.
- ఒక్కసారి చూస్తే, ఎప్పటికీ గుర్తుపడతారు
మెదడు పడే ఒక trap ని మీ కళ్ళతో ఒక్కసారి చూస్తే, నిజ జీవితంలో అది ఎదురైనప్పుడు వెంటనే గుర్తుపడతారు.
- రోజుకి కొన్ని నిమిషాలు చాలు
ఒకేసారి పెద్ద ప్రయత్నం కంటే, రోజూ చేసే చిన్న Reps ఎక్కువ కాలం నిలుస్తాయి.
ఇది IQ పెంచే మాయ కాదు. మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకుని, రోజువారీ జీవితాన్ని సులభం చేసుకునే సాధన.
మేము చేసేది
Mental exercises అన్నీ ఒకేచోట
ప్రపంచవ్యాప్తంగా జరిగిన psychology, neuroscience పరిశోధనల నుంచి, రోజువారీ జీవితానికి నిజంగా పనికొచ్చే mental exercises ని వెతికి, సులభంగా, తెలుగులో మీ ముందుకు తెస్తాం.
- 01వెతుకుతాం
పేరున్న పరిశోధనల్లోంచి, మీ జీవితానికి పనికొచ్చేవి మాత్రమే.
- 02సులభం చేస్తాం
Jargon లేకుండా, మన ఉదాహరణలతో, మన భాషలో.
- 03Rep గా మారుస్తాం
Phone లో చేసే challenge గా, కథగా, వీడియోగా: మీరు ఈ రోజే చేయగలిగేలా.
ఎక్కడ మొదలుపెట్టాలి
Train అయ్యే దారులు
Phone లో 30 challenges, 30వ రోజు మీ Mind Report. మొదటి 3 ఉచితం.
Lab చూడండికథలతో నేర్చుకోండితాతగారి నియమాలుఒక తాతగారు, ఒక మనవడు, 68 జీవిత నియమాలు. మొదటి సాయంత్రం ఉచితం.
పుస్తకం చూడండిచూసి, విని నేర్చుకోండివీడియోలు, PodcastYouTube లో లోతైన తెలుగు వీడియోలు, Spotify లో podcast. ఎప్పుడూ ఉచితం.
వీడియోలు చూడండికొత్త courseనాయకత్వం · LeadershipTeam ని నడిపించడం నేర్చుకోండి: 9 modules, 42 Telugu video lessons, worksheets, quizzes, certificate. 4 lessons ఉచితం.
Course చూడండి
Mental Gym వెనుక
Mental Gym వెనుక ఎవరు?
Bharath KP: filmmaker, Mental Gym సృష్టికర్త. India AI Impact Summit 2026 అధికారిక ప్రారంభ చిత్రం SHUNYA కి రచన, AI రూపకల్పన, దర్శకత్వం ఆయనే. ప్రధాని నరేంద్ర మోదీ గారు, ప్రపంచ నాయకుల ముందు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
మంచి psychology, neuroscience ని మన భాషలో, రోజువారీ జీవితానికి పనికొచ్చేలా అందించడమే Mental Gym లక్ష్యం.
మొదటి Rep ఈ రోజే
60 సెకన్ల challenge తో మొదలుపెట్టండి. Account అవసరం లేదు.